తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల నిఘా నీడలో భైంసా పట్టణం

నిర్మల్ జిల్లా భైంసా పోలీసుల నిఘా నీడలో ప్రశాంతంగా ఉంది. నిన్న అర్ధరాత్రి పట్టణంలో జరిగిన అల్లర్ల కారణంగా.. పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఎవరు కూడా బయటకి రావద్దని, ఎక్కడైన అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Riots erupted in Bhainsa town of Nirmal district on Sunday night. Police on alert with the incident are enforcing Section 144 armor
పోలీసుల నిఘా నీడలో భైంసా పట్టణం

By

Published : Mar 8, 2021, 1:11 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు 144 సెక్షన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వు కోవటంతో పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో బస్టాండ్ సమీపంలోని దుకాణాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.... 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం బస్సులు డిపోకు పరిమితం కాగా... ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అయితే, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని.... సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్‌ ఇన్ ఛార్జ్‌ ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ వెల్లడించారు.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని సూచించారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నాతాధికారులతో చర్చిస్తున్నట్లు కిషన్‌ రెడ్డి అమిత్‌షాకు వివరించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details