తెలంగాణ

telangana

ETV Bharat / state

rgukt viral video: వైరల్​గా మారిన ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం.. - బాసర ట్రిపుల్​ ఐటీ వైరల్​ వీడియో

RGUKT Viral Video: బాసర ఆర్జీయూకేటీలోని ఓ భోజనశాలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇప్పుడిప్పుడే క్యాంపస్​లో సమస్యలు సద్దుమణుగుతున్నాయనుకుంటే.. సిబ్బంది నిర్వాకంతో మరోసారి హాట్​టాపిక్​గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే..?

rgukt viral video: వైరల్​గా మారిన ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం..
rgukt viral video: వైరల్​గా మారిన ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం..

By

Published : Aug 6, 2022, 2:41 PM IST

వైరల్​గా మారిన ఆర్జీయూకేటీ భోజనశాల సిబ్బంది నిర్వాకం..

RGUKT Viral Video: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలోని ఓ భోజనశాలలో పనిచేసే సిబ్బంది.. అక్కడే స్నానాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. భోజనశాలను పరిశుభ్రంగా ఉంచి.. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయాల్సిన సిబ్బంది నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల ఆహారం వికటించి.. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు పలుమార్లు అన్ని భోజనశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

గురువారం రాత్రి డైరెక్టర్ సతీశ్​ కుమార్ భోజనశాలను పరిశీలించి.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సరుకులను పరిశీలించారు. ఆ మరుసటి రోజే స్నానాలు చేస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో కావాలనే కొందరు వాటిని వైరల్​ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజుల నుంచి సిబ్బంది అక్కడే స్నానాలు చేస్తున్నారని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు తెలిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details