నిర్మల్లో ఎక్సైజ్ నేరాలు అదుపు చేసేందుకు ఎక్సైజ్ శాఖ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని కడెం మండలంలో గుడుంబా స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఎలగడప శివారు సాగునీటి కాలువ వద్దనున్న గుడుంబా స్థావరాల్లో 500 లీటర్ల నల్లబెల్లం పానకం ధ్వంసం చేసినట్లు సీఐ సంపత్కృష్ణ తెలిపారు.
గుడుంబా స్థావరాలపై దాడి.. 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం - నిర్మల్లో గుడుంబా స్థావరాలపై దాడి
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఉన్న గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. సుమారు 500 లీటర్ల నల్లబెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ సంపత్కృష్ణ తెలిపారు.
గుడుంబాస్థావరాలపై దాడులు.. 500 లీటర్ల నల్లబెల్లం ధ్వంసం
లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఎలగడపలో అక్రమంగా అమ్ముతున్న సుమారు ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అయితే తమను చూసి ఆమె పారిపోయిందని... పరారీలో ఉన్న నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిఃమల్కాజిగిరిలో 100 కేజీల గంజాయి పట్టివేత