తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల భవనాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

ఖానాపూర్​లోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని క్వారంటైన్​ కేంద్రంగా మార్చాలని నిర్మల్​ కలెక్టర్​ను స్థానిక కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. సొంత ఇళ్లు లేనివారు హోం ఐసోలేషన్​లో ఉండలేకపోతున్నారని స్థానిక నాయకుడు అన్నారు.

congress requested to nirmal collector
నిర్మల్​ కలెక్టర్​కు కాంగ్రెస్​ నాయకుల విజ్ఞప్తి

By

Published : May 17, 2021, 9:47 PM IST

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతి పత్రం అందజేశారు. కరోనా వైరస్ సోకిన బాధితులు హోం ఐసోలేషన్​​లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురాం సత్యం అన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారిని యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులకు భోజన సౌకర్యం, మందులు, ఇతరత్రా వస్తువులు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే హోం క్వారంటైన్​లో ఉన్న వారికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కిషోర్ నాయక్, షబ్బీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ

ABOUT THE AUTHOR

...view details