తెలంగాణ

telangana

ETV Bharat / state

వినతి పత్రం: వివేకానంద పాఠశాలపై చర్యలు తీసుకోండి.. - భైంసాలో ఏబీవీపీ ఆందోళన వార్తలు

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక వివేకానంద పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవో కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు.

request-document-take-action-against-vivekananda-school
వినతి పత్రం: వివేకానంద పాఠశాలపై చర్యలు తీసుకోండి

By

Published : Sep 14, 2020, 10:21 PM IST

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని వివేకానంద పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈవో కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు. వివేకానంద పాఠశాలను నారాయణ పాఠశాలకు అప్పగించి పేరు మార్చేందుకు ప్రయత్నిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యాశాఖ నుంచి...

పాఠశాల పేరు మార్చుకునేందుకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడకున్నా.. నారాయణ పాఠశాల పేరుతో వివేకానంద పాఠశాల యాజమాన్యం కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. కార్పొరేట్ పాఠశాలను జిల్లా నుంచి తరిమేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గంగ ప్రసాద్, సాయి, సాకేత్, సందీప్, గణేష్, రాకేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:-వ్యవసాయ ఆర్డినెన్స్​లపై హరియాణా రైతుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details