తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాలి: అల్లోల - జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిర్మూలనపై సమగ్రంగా చర్చించి.. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకే అందాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

కొవిడ్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాలి : మంత్రి అల్లోల
కొవిడ్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాలి : మంత్రి అల్లోల

By

Published : Aug 18, 2020, 7:28 AM IST

కరోనా వైరస్​పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్​లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కరోనా వ్యాప్తిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 3581 పరీక్షలు నిర్వహించగా... 686 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. ఇందులో 429 యాక్టివ్ కేసులున్నాయని, 249 మందిని డిశ్చార్జ్ అయ్యారని స్పష్టం చేశారు. 8 మంది మరణించారన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు...

జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల సాగునీటి ప్రాజెక్టులు, కుంటలు, చెరువులు నిండాయని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ పేర్కొన్నారు. ఫలితంగా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 674 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 560మీల్లీ మీటర్ల వర్షమే కురిసిందన్నారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు.

ఇవీ చూడండి : 'పోతిరెడ్డుపాడుపై అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు'

ABOUT THE AUTHOR

...view details