నవంబర్ 24న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారం, హత్యకు గురైన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసపల్లికి చెందిన టేకు లక్ష్మి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతుంటే... ఇప్పుడు పరామర్శించడానికి వస్తారా అంటూ గ్రామస్థులు రేఖానాయక్‌ను నిలదీశారు. ఎమ్మెల్యే గ్రామస్థులను సముదాయించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రేఖానాయక్ - latest news on mla rekha nayak
గత నెల 24న హత్యాచారం, హత్యకు గురైన టేకు లక్ష్మి కుటుంబాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. ఘటన జరిగిన ఇన్ని రోజులకు.. పరామర్శించడానికి వస్తారా అంటూ గ్రామస్థులు రేఖానాయక్‌ను నిలదీశారు.
టేకు లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన రేఖానాయక్
ఊరూరూ తిరుగుతూ.. చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే ఆడవాళ్లకు బయట రక్షణ లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదంటే దిశ నిందితుల మాదిరిగానే ఈ నిందితులనూ శిక్షించాలన్నారు. ఎలాగైనా నిందితులకు శిక్ష పడేలా చేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
ఇవీ చూడండి: 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో వ్యాజ్యం