నిర్మల్ జిల్లా కేంద్రం నిర్మానుష్యంగా మారిపోయింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో నిర్మల్ పట్టణానికి చెందిన ఇసాక్ అనే వ్యక్తి కరోనా లక్షణాలతో మృతిచెందాడు. ఫలితంగా నిర్మల్ జిల్లా కేంద్రాన్ని నాలుగు రోజుల పాటు కఠినమైన లాక్ డౌన్లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇసాక్ నివసించే కాలనీతో పాటు చుట్టు పక్కన కిలోమీటర్ దూరం వరకు రెడ్ జోన్‌గా ప్రకటించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులు వద్దు...
ద్విచక్ర వాహనాలు, ప్రజా రవాణా వాహనాలు, కార్లు లాంటివి ఏవీ కూడా రహదారిపైకి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ గుంపులుగా కనపడవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిత్యావసర సరకులు లేదా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదన్నారు. సరైన కారణాలు చూపకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫలితంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలోని రహదారులపై ఎటుచూసినా నిర్మానుష్యంగా కనబడుతోంది.
ఎట్టిపరిస్థితుల్లోనూ గుంపులుగా వెళ్లొద్దు : అధికారులు ఇవీ చూడండి : కరోనా పరీక్షలకు ఇక కొత్త పద్ధతి- అరగంటలో రిజల్ట్