తెలంగాణ

telangana

ETV Bharat / state

హెల్మెట్​ వినియెగదారులకు జిల్లా ఎస్పీ సన్మానం - నిర్మల్​ జిల్లా ఎస్పీ  శశిధర్​ రాజ్

నిర్మల్​ జిల్లా మచ్కల్​లో పోలీసులు నిర్భంద తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు భద్రత ఇవ్వడానికి తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్పీ శశిధర్​ రాజ్​ పేర్కొన్నారు. హెల్మెట్​ వాడుతున్న ఇద్దరికి సన్మానం చేశారు.

నిర్మల్​ ఎస్పీ

By

Published : Jun 26, 2019, 11:22 AM IST

భద్రత కల్పించేందుకు ముందుంటాం
ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసులు ముందుంటారని నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​ రాజ్​ అన్నారు. నిర్మల్​ జిల్లా ముధోల్​ మండలం మచ్కల్​లో పోలీసులు ఉదయం నుంచి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహన పత్రాలు సరిగా ఉంచుకొని, హెల్మెట్​ ధరించాలని ఎస్పీ కోరారు. గ్రామంలో నిరంతరం హెల్మెట్​ వాడుతున్న ఇద్దరికి సన్మానం చేశారు. ఈ సోదాల్లో డీఎస్పీ, ఏఎస్పీ, 100 మంది సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details