త్వరలో రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న దృష్ట్యా... ముస్లింలు సహార్, ఇఫ్తార్, నమాజ్ ఇంట్లోనే చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో రంజాన్ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.
'లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే రంజాన్ వేడుకలు' - LOCK DOWN EFFECTS TO RAMZAN
నిర్మల్లోని కలెక్టరేట్లో రంజాన్ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మత పెద్దలతో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ నిబంధనల మేరకు రంజాన్ కార్యక్రమాలను ముస్లిం సోదరులు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు.
'లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే రంజాన్ వేడుకలు'
కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యవసర సరుకులు, కూరగాయలు, పాలు, మందులు వారి ఇంటి వద్దనే అందిస్తున్నామన్నారు. 12 రోజులుగా జిల్లాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఇదే తరహాలో ప్రజలు సహకరించి కరోనాను తరిమికొట్టాలని సూచించారు.