తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2021, 8:41 PM IST

ETV Bharat / state

నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని... తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. గ్రామస్థులు ఖాళీ బిందెలతో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

Protest with empty bins to solve water problem in nirmal
నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని... తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. చాకిరేవు, వస్పెల్లీ, కొత్తగూడ గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలుగా తాగునీటి నీటి సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. ఖాళీ బిందెలతో నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా... గిరిజన గ్రామాలకు ఇప్పటివరకు చుక్క నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా పక్కనున్న చిక్​మన్ వాగు నీటిని తాగుతున్నామని తెలిపారు. అవి తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్​ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం!

ABOUT THE AUTHOR

...view details