తెలంగాణ

telangana

ETV Bharat / state

బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ధర్నా - iftu dharna

బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ నిర్మల్​ జిల్లా రాంపూర్​ గ్రామంలోని శివాజీ బీడీ కంపెనీ ఎదుట ఐఎఫ్​టీయూ నాయకులు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్​ 41ను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ ధర్నా
protest for increase in wages of beedi workers in nirmal district

By

Published : Oct 10, 2020, 5:16 PM IST

బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్​ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలోని శివాజీ బీడీ కంపెనీ ఎదుట ఐఎఫ్​టీయూ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని ఐఎఫ్​టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కట్ల రాజన్న తెలిపారు. చాలీచాలని వేతనాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతన ఒప్పందం ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి వేతనాలు పెంచాల్సినప్పటికీ యాజమాన్యాలు మొండిగా వ్యవహరిస్తూ శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కంపెనీ యాజమాన్యాలు వేతనాలు పెంచాలని, లేనట్లయితే కార్మికులు సమ్మె చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బక్కన్న, గఫూర్, శ్యాంరావు, నారాయణ, జమున, లక్ష్మణ్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: నోరు మంచిగా ఉంటే రోగాలు రావు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABOUT THE AUTHOR

...view details