నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ బొప్పారం గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో నాలుగేళ్ల క్రితం నిర్మించిన 400 కేవీ విద్యుత్తు కేంద్రం నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి పరిహారం, ఉద్యోగం కల్పిస్తామని అధికారులు ప్రకటించారని అదే గ్రామానికి చెందిన కొప్పెల నర్సారెడ్డి, లక్ష్మీ దంపతులు అన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు పెట్రోలుతో విద్యుత్తు కేంద్రం వద్ద అందోళన చేపట్టారు. పెట్రోలు బాటిల్‌ను లాక్కోవడానికి సిబ్బంది ప్రయత్నించగా.. పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
బొప్పారంలో ఉద్రిక్తత.. ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్! - విద్యుత్తు కేంద్రం వద్ద పెట్రోలుతో నిరసన
సోన్ మండలం బొప్పారం గ్రామానికి చెందిన నర్సారెడ్డి దంపతులు విద్యుత్తు కేంద్రం వద్ద పెట్రోలుతో అందోళన చేపట్టారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన 400 కేవీ విద్యుత్తు కేంద్ర నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకి పరిహారం, ఉద్యోగం కల్పిస్తామని అధికారులు ప్రకటించి.. ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బొప్పారంలో ఉద్రిక్తత.. ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్!
సకాలంలో స్పందించిన పోలీసులు అతణ్ని అడ్డుకొని నచ్చజెప్పారు. విద్యుత్ కేంద్ర నిర్మాణంలో విలువైన భూములు కోల్పోయామని వారు వాపోయారు. ప్రారంభోత్సవ సమయంలో మంత్రులు, ఉన్నతాధికారులు భరోసా ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: నేతాజీ నేటి యువతకు ఆదర్శం: లక్ష్మణ్