మూడు నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి రాజన్న డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వామపక్షాల ఆందోళన - వామపక్షాల ధర్నా
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ వద్ద జాతీయ రహదారిపై వామపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వామపక్షాల ఆందోళన, ఐఎఫ్టీయూ, నిర్మల్
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆహార ధాన్యాల సేకరణలో నాణ్యతా ప్రమాణాల పేరిట.. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.