తెలంగాణ

telangana

ETV Bharat / state

40 మంది ప్రయాణించాల్సిన బస్​లో 160 మంది.. ఆ తర్వాత.. - Telangana news

Bus Seized: సాధారణంగా ఒక బస్​లో ఎంతమంది ప్రయాణిస్తారు? అంటే దానికి సమాధానం 40, లేదా 50 మంది అని అంటారా? ఓకే మీరు చెప్పింది కరెక్టే. కానీ ఓ బస్​లో 160 మంది ప్రయాణించారు. అంటే సాధారణం కన్నా మూడింతలు ఎక్కువ. ఇంతకీ ఈ బస్ కథేంటో తెలుసుకుందాం.

Bus
Bus

By

Published : Apr 16, 2022, 11:46 AM IST

Updated : Apr 16, 2022, 12:15 PM IST

Bus Seized: హైదరాబాద్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​కు ఓ ప్రైవేట్​ ట్రావెల్స్ బస్ (UP 05 OCT 1368) బయల్దేరింది. ప్రయాణికుల హడావుడితో బస్​లో అంతా గందరగోళంగా ఉంది. ప్రయాణం సాఫీగానే సాగుతుంది. అలా... బస్​ నిర్మల్​ జిల్లాలోకి ప్రవేశించింది. ఇంతలో బస్​ సోన్​ మండలం గంజాల్​ టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. అక్కడే తనిఖీలు చేస్తున్న రవాణాశాఖ అధికారులు ఆ బస్​ను సీజ్ చేశారు.

పరిమితికి మించి ప్రయాణికులు బస్​లో ఉండటమే కారణమని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. 40 మంది ప్రయాణికులకు అనుమతి ఉన్న వాహనంలో దాదాపు నాలుగింతల ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్య నేరమని వారు చెబుతున్నారు. ఇలా ప్రయాణించడం సురక్షితం కాదన్నారు. అధిక ప్రయాణికులతో వెళ్లేటప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ప్రమాదం ఊహించని స్థాయిలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించి ప్రయాణించే ఏ వాహనమైనా అదుపులోకి తీసుకొని కోర్టుకు అప్పజెబుతామని అధికారులు హెచ్చరించారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 16, 2022, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details