ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో పాల్గొని.. ప్రజల నుంచి సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
'త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించండి' - నిర్మల్ జిల్లా కలెక్టర్ వార్తలు
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
'త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించండి'
శాఖల వారీగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, పెండింగులో ఉన్న వాటిపై ఆరా తీశారు. సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్ ఫండింగ్