ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్యాచార ఘటనను తీవ్రంగా నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి, యూపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యూపీ ఘటనను నిరసిస్తూ ప్రగతిశీల మహిళాసంఘం ఆందోళన - నిర్మల్లో ప్రగతిశీల మహిళాసంఘం నిరసన
ఉత్తర్‌ప్రదేశ్‌లో దళిత యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల మహిళాసంఘం విమర్శించింది. నిర్మల్ జిల్లాలో హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
యూపీ ఘటనను నిరసిస్తూ ప్రగతిశీల మహిళాసంఘం ఆందోళన
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగామణి, లతా, లలిత, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాజన్న, జిల్లా అధ్యక్షులు బక్కన్న, కార్యదర్శి రామ లక్ష్మణ్, గంగన్న, గపూర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:జయశంకర్ జిల్లా అదనపు కలెక్టర్కు బ్రెయిన్ స్ట్రోక్