నిర్మల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. కొవిడ్ బారిన పడకుండా చాలా మంది వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ... కొందరి నిర్లక్ష్యం అనేక మందిలో భయాన్ని కలిగిస్తుంది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామ శివారులోని రెడ్డికుంట చెరువు సమీపంలో పీపీఈ కిట్లు ప్రత్యక్షమయ్యాయి.
రోడ్డు పక్కన పీపీఈ కిట్లు... భయాందోళనలో ప్రజలు - corona cases in nirmal
కరోనా బాధితులకు వైద్యం చేసేప్పుడు వేసుకునే పీపీఈ కిట్లు రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. వాడేసిన పీపీఈ కిట్లను కాల్చేయకుండా రోడ్లపక్కనే ఇష్టానుసారంగా పారేయటం వల్ల ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి.

ppe kits appear at road side in kanakapur
ఉదయం పంట చేన్లకు వెళ్లే వారికి పీపీఈ కిట్లు దర్శనమివ్వగా... భయాందోళనకు గురయ్యారు. ప్రజల్లో ఇప్పటికే కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం వాడేసిన పీపీఈ కిట్లను కాల్చేయకుండా... రోడ్డుపక్కన నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.