నిర్మల్ జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు జడ్పీటీసీ స్థానాలకు గాను 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 49 ఎంపీటీసీ స్థానాలకు 146 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకై 296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 35 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వేసవికాలం కావటం వల్ల ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, మంచినీటి సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.
రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం - Polling Preparations In Nirmal district
రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు నిర్మల్ జిల్లా సన్నద్ధమైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. పోలింగ్ సామాగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేశారు.
![రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3234682-923-3234682-1557405236977.jpg)
రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం