తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరిగాం గ్రామంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు.. వాహనాలు సీజ్

నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలను నివారించడానికే ఈ తనిఖీలు చేపట్టినట్లు ముథోల్ సీఐ తెలిపారు.

police searching at bhorigam, nirmal district
బోరిగాంలో నిర్బంధ తనిఖీలు, నిర్మల్ జిల్లా వార్తలు

By

Published : Apr 26, 2021, 8:47 AM IST

నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో భైంసా ఏఎస్పీ ఆదేశాలతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే పోలీసులు ఇంటింటా సోదాలు జరిపి... సరైన పత్రాలు లేని 123 ద్విచక్రవాహనాలు, 4 టాటామ్యాజిక్​ వాహనాలు, ఒక ఆటో, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ.50వేలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు.

ఈ నిర్బంధ తనిఖీల్లో దాదాపు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు, పెండింగ్ జరిమానా చెల్లించి, వాటితో పాటు హెల్మెట్​ చూపించిన తర్వాత వాహనాలను తీసుకుపోవాలని ముథోల్ సీఐ అజయ్ బాబు తెలిపారు. గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ వ్యాపారాలు నివారించడానికే ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

ఇదీ చదవండి: వెంటిలేటర్ల వినియోగంపై పలు ఆస్పత్రుల నిర్లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details