నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లింగాపూర్ తాండాలో గిరిజనులకు నిత్యవసర సరుకులు అందజేసి పోలీసులు ఔదార్యాన్ని చాటుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు నిర్మల్ జిల్లాలోని గ్రామాలన్నింటిని కట్టడి చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా గ్రామాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజల ఇబ్బందులను గమనించిన పోలీసులు వారం రోజులకు సరిపడా నిత్యావసరాలను పంపిణీ చేశారు.
గిరిజనులకు నిత్యావసరాలు పంపిణి చేసిన పోలీసులు - నిర్మల్ జిల్లా
విధి నిర్వహణలోనే కాదు.. ప్రజలకు సాయం చేయడంలో కూడా పోలీసులు తమ ఔనత్యాన్ని చాటుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతోన్న గిరిజనులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణి
లాక్‌డౌన్‌ను ఎవరు ఉల్లంఘించొద్దని, ప్రజల అవసరాలపై తాము దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ, ఎస్సై పాల్గొన్నారు.
ఇవీ చూడండి:పారిపోయిన ప్రేమజంట- లాక్డౌన్ రూల్స్‌కు బుక్కైందంట!