నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో భైంసా ఏఎస్పీ కిరణ్ కారే ఆదేశాలతో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి ఇంటింటా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 58 ద్విచక్రవాహనాలు, 4 టాటా మ్యాజిక్ వాహనాలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కల్లూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు
నిర్మల్ జిల్లా కల్లూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 58 ద్విచక్రవాహనాలు, 4 టాటా మ్యాజిక్ వాహనాలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిర్బంధ తనిఖీల్లో దాదాపు 100మంది పోలీసులు పాల్గొన్నారు.
cordon search, Kallur village, nirmal
ఈ నిర్బంధ తనిఖీల్లో దాదాపు 100మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన పత్రాలు, హెల్మెట్ చూపించి.. పెండింగ్ చలనాలు కట్టి వాహనాలను తీసుకువెళ్లాలని సూచించారు. గ్రామంలో అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతూ.. అక్రమ వ్యాపారం చేసే వారిని నిర్మూలించడమే నిర్బంధ తనిఖీల ముఖ్య ఉద్దేశమని పోలీసులు అన్నారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా 2కోట్లు దాటిన కరోనా కేసులు