తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

నిర్మల్​లో అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్​ నుంచి మహారాష్ట్రకు ఆటోల్లో తరలిస్తుండగా... పట్టుకొని డ్రైవర్​లపై కేసు నమోదు చేశారు. రాయితీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.

By

Published : Nov 3, 2020, 11:40 AM IST

police caught ration rice illegal trasport from nirmal to maharastra
అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత


నిర్మల్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు సారంగాపూర్ ఎస్సై రాంనర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా... మహారాష్ట్ర వైపు వెళ్తున్న రెండు ఆటోలు(టీఎస్18 టీ 0110, ఏపీ 01వై 7263) పట్టుకున్నారు.

ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​లు మహమ్మద్ అమీర్, ఎస్కే జాబీర్​ను అదుపులోకి తీసుకుని... ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

ఇదీ చూడండి:సన్నరకానికి మద్దతు ధర చెల్లించని మిల్లర్లపై టాస్క్​ఫోర్స్ కొరడా

ABOUT THE AUTHOR

...view details