తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ సరఫరా లేక పోచంపల్లి వాసుల ఇబ్బందులు - nirmal district news

విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్థుల సమస్యను నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచంపల్లి జడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరాకు కావాల్సిన పూర్తి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

no electricity supply, no electricity supply in pochampally village
పోచంపల్లిలో విద్యుత్ సరఫరా, తెలంగాణ వార్తలు, నిర్మల్ జిల్లా వార్తలు

By

Published : May 31, 2021, 7:04 PM IST

నిర్మల్ జిల్లా పెంబి మండలం పోచంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేక గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా జానుభాయ్ తెలిపారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్​తో పాటు విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈని కలిసి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు జడ్పీటీసీ తెలిపారు. ఆయా శాఖల అధికారులు విద్యుత్ సరఫరాకు కావాల్సిన పూర్తి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details