తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ - Pochamma Bonala Festival at pardy village

నిర్మల్ జిల్లా కుభీర్​ మండలం పార్డీ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. మహిళలంతా కలిసి కట్టుగా అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైరస్​ బారినుంచి తమను కాపాడాలంటూ తల్లిని వేడుకున్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ
ఘనంగా పోచమ్మ తల్లి బోనాల పండుగ

By

Published : May 10, 2021, 9:12 AM IST

నిర్మల్ జిల్లా కుభీర్​ మండలం పార్డీ(కె) గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి తమ గ్రామంపై ఎక్కువ ప్రభావం చూపకూడదని గత సంవత్సరం గ్రామ దేవతలకు మొక్కుకున్న మహిళలు తమ మొక్కులను తీర్చుకున్నారు.

మహిళలంతా కలిసి కట్టుగా అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరస్​ నుంచి తమను కాపాడాలంటూ అమ్మవారిని వేడుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

ఇదీ చూడండి.. కరోనా రెండో ఉద్ధృతికి పల్లెలు విలవిల

ABOUT THE AUTHOR

...view details