నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. 'ప్లాస్టిక్ సంచులు వద్దు చేతి సంచులు ముద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
'ప్లాస్టిక్ సంచులు వద్దు చేతి సంచులు ముద్దు' - అవగాహన ర్యాలీ
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
'ప్లాస్టిక్ సంచులు వద్దు చేతి సంచులు ముద్దు'