తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసాలో కుదుటపడుతున్న పరిస్థితులు - peaceful situation at bhaimsa in nirmal district

ఘర్షణలతో అట్టుడికిన భైంసాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. కరీంనగర్ రేంజ్ ఐజీ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు మున్సిపల్ ఎన్నికల​ ప్రచారం చేసుకోవచ్చని.. కానీ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. అటు ఇవాళ్టి బంద్​ పిలుపును భాజపా ఉపసంహరించుకుంది.

peaceful situation at bhaimsa  in nirmal district
భైంసాలో కుదుటపడుతున్న పరిస్థితులు

By

Published : Jan 14, 2020, 8:20 PM IST

భైంసాలో కుదుటపడుతున్న పరిస్థితులు
నిర్మల్ జిల్లా భైంసాలో పరిస్థితులు ప్రశాంతంగా మారుతున్నాయి. పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దింపారు. ఉదయం పోలీసులతో పాటు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది.

అల్లర్లకు సంబంధించి 6 కేసులు నమోదు

నిర్మల్​తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపివేశారు. ఘర్షణకు సంబంధించి వదంతులను ప్రచారం చేయొద్దన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్​ రేంజీ ఐజీ ప్రమోద్​ కుమార్​ హెచ్చరించారు. అల్లర్లకు సంబంధించి 6 కేసులు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 144 సెక్షన్​ విధించామని వెల్లడించారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందన్నారు. నేతలు ప్రచారం చేసుకోవచ్చని.. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు. గత మూడు రోజులుగా భయాందోళనలకు గురైన భైంసా ప్రజలు ప్రశాంతత నెలకొనడం వల్ల ఊపిరి పీల్చుకుంటున్నారు. భాజపా కూడా ఇవాళ్టి బంద్​ను ఉపసంహరించుకుంది.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: గద్వాల సంస్థానంలో పుర సమరం

ABOUT THE AUTHOR

...view details