నిర్మల్ జిల్లా ముధోల్ మైనారిటీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల వైఖరికి నిరసనగా విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
'మా పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు' - ముధోల్ గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థినులతో ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నిర్మల్ జిల్లా ముధోల్ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'మా పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు'
ఉపాధ్యాయులు తమను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కొడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేసినా.. ప్రిన్సిపల్ పట్టించుకోలేదని విద్యార్థినులు తెలిపారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న జిల్లా మైనారిటీ గురుకులాల విద్యాధికారి ముస్తఫా పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.