వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రైతు వేదికలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సాంకేతిక విజ్ఞానంపై రైతుల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల రైతు వేదికను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ఆయన సందర్శించారు.
'సాంకేతిక విజ్ఞానంపై రైతుల్లో చైతన్యం తీసుకొస్తాం' - Chityala Raitu Vedika
నిర్మల్ జిల్లాలోని చిట్యాల రైతు వేదికను పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు సందర్శించారు. ప్రభుత్వం.. రైతు వేదికల ఏర్పాటుతో అన్నదాతలకు చేయూతను అందిస్తోందని ఆయన అన్నారు.
internet facility in raithu vedika
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, మండల వ్యవసాయశాఖ అధికారి వసంత్ రావు, ఏఈవో హర్షిత, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ రమేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కరోనా ఫ్రీ' గ్రామం.. రూ.50 లక్షల పురస్కారం