తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ - సోన్​ మండల వార్తలు

నిర్మల్​ జిల్లా సోన్​ మండలంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను జడ్పీటీసీ జీవన్​రెడ్డి ప్రారంభించారు. ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయని ఆయన తెలిపారు.

palle prakruti vanam opened at son in nirmal district
జిల్లావ్యాప్తంగా ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ

By

Published : Nov 4, 2020, 3:01 PM IST

గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నిర్మల్​ జిల్లా సోన్​ జడ్పీటీసీ జీవన్​రెడ్డి అన్నారు. మండలంలోని పాక్​పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయని జీవన్​రెడ్డి తెలిపారు.

నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో అశోక్​, సర్పంచ్​ గంగారెడ్డి, ఉపసర్పంచ్​ మహేశ్​, ఎంపీటీసీ మల్కవ్వ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఃఅడవిపందుల నియంత్రణపై కసరత్తు... వెర్మిన్​ జాబితాలో చేర్చే యోచన

ABOUT THE AUTHOR

...view details