తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన ధాన్యం.. పిడుగుపాటుకు మేకలు మృతి - paddy grains collapsed and goats died in nirmal district

నిర్మల్​ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోగా, పలు గ్రామాల్లో పిడుగు పడి మూగజీవులు మృత్యువాత పడ్డాయి.

paddy grains collapsed in nirmal district
అకాల వర్షానికి తడిసిన ధాన్యం

By

Published : May 2, 2021, 7:43 PM IST

నిర్మల్​ జిల్లాలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పంటను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం నీటి పాలవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. బలమైన గాలులకు దాదాపు పది ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.

లోకేశ్వరం మండలం కిష్టాపూర్​లో షేక్​ అన్వర్​కు చెందిన మేకల మందపై పిడుగుపడింది. దాదాపు రూ. 2 లక్షల విలువైన మేకలు మృత్యువాత పడ్డాయి.

ఇదీ చదవండి:ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details