నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని ఎంపీపీ కోరారు.
అనంతపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ - అనంతపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ
నిర్మల్ జిల్లా అనంతపేట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఆయన కోరారు.
అనంతపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రం
నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విలాస్, మాజీ ఎంపీటీసీ పంతులు, నాయకులు అశోక్, ముత్యం రెడ్డి, బాలగౌడ్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:లాక్డౌన్లో పేదలకు అండగా కేర్ అండ్ షేర్ ఫౌండేషన్