'డైరెక్టర్‌తో సమస్యలు పరిష్కారం కావు.. కేసీఆర్ రావాల్సిందే' - basara IIT students protest latest news
12:14 June 16
బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ సతీశ్ కుమార్
తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళన తగ్గేదేలే అని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మూడ్రోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతంగా సాగుతోంది.
ఈ క్రమంలో కాస్త దిగొచ్చిన సర్కార్ బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ సతీశ్ కుమార్‌ను నియమించింది. ఆయన విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది. అయినా వెనక్కి తగ్గిన విద్యార్థులు డైరెక్టర్ నియామకంతో తమ సమస్యలు పరిష్కారం కావని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ వద్దకు వస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకు కూర్చున్నారు.
మరోవైపు.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని భైంసా ఏఎస్పీ తెలిపారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. డైరెక్టర్ నియామకం గురించి విద్యార్థులకు చెప్పామని అన్నారు. విద్యార్థులకు ఆహారం, నీళ్లు నిలిపేశామన్న వార్తల్లో వాస్తం లేదని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులందరికి కూడా ఆహారం, నీళ్లు అందుతున్నాయని చెప్పారు.