ఆహార డబ్బాల మాటున తరలిస్తున్న రూ.15లక్షల విలువైన నిషేధిత గుట్కాను నిర్మల్ జిల్లా సొన్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి సొన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా... కర్ణాటక నుండి ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని తనిఖీ చేయగా ఆహార డబ్బాలున్నాయి. వాహనంలో పొగాకు వాసన రావడం వల్ల అనుమానమొచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా డబ్బాల చాటున 70భారీ సంచుల్లో గుట్కాను తరలిస్తున్నట్లు గుర్తించారు.
నిర్మల్‌లో రూ.15 లక్షల విలువగల గుట్కా పట్టివేత - గంజాల్ టోల్‌ప్లాజా వద్ద గుట్కా పట్టివేత
నిర్మల్ జిల్లాలో భారీ మొత్తంలో గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాల్ టోల్‌ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఆహార ప్యాకెట్ల చాటున తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.

నిర్మల్‌లో రూ.15 లక్షల విలువగల గుట్కా పట్టివేత
వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా... బెంగళూరుకు చెందిన వాహన యజమాని ఇర్షాద్ అహ్మద్ ఖాన్.. గుట్కా ప్యాకెట్లను సంచుల్లో నింపి పంపాడని... హైదరాబాద్‌లో ఆహార డబ్బాలు వేసుకుని ఛత్తీస్‌గఢ్ వెళ్లమన్నట్లు తెలిపాడు. డ్రైవర్ సమాచారంతో వాహన యజమానిపై కేసు నమోదు చేసుకుని యజమానిని తీసుకొచ్చేందుకు బెంగళూరుకు బృందాన్ని పంపినట్లు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
ఇదీ చదవండి:ఆస్తి కోసం బాబాయిని నడిరోడ్డుపై నరికేశారు!