తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​లో మరో కరోనా పాజిటివ్... 7 ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేత - CORONA EFFECTS

12 రోజులుగా ఒక్క పాజిటివ్​ కూడా రాలేదు... ఇక రెడ్​జోన్​లో నుంచి ఆరెంజ్​ జోన్​లోకి వెళ్లొచ్చు. నిర్బంధ ఆంక్షలు కొద్దిగా సడలిస్తారు అనుకున్న నిర్మల్ జిల్లా ప్రజలు ఆశలు ఆవిరయ్యాయి. జిల్లా కేంద్రంలో మరో కరోనా పాజిటివ్​ రాగా... అధికారులు అప్రమత్తమయ్యారు.

ONE MORE CORONA POSITIVE CASE IN NIRMAL
నిర్మల్​లో మరో కరోనా పాజిటివ్... 7 ప్రాంతాల్లో ఆంక్షల ఎత్తివేత

By

Published : Apr 24, 2020, 8:08 PM IST

నిర్మల్ జిల్లాను ఇప్పటికే ప్రభుత్వం రెడ్​జోన్​గా ప్రకటించింది. జిల్లాలో గతంలో 19 కేసులు నమోదు కాగా... అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 18 కంటైన్మెంట్ ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను బయటకు రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 12 రోజులుగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఇక ఆరెంజ్ జోన్​లోకి వెళ్లొచ్చని అధికారులు ఊపిరిపీల్చుకునేలోపే నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది.

గతంలో జిల్లాలోని పలువురు అనుమానితులను క్వారెంటైన్​లో ఉంచారు. వీరి రక్తనమూనాలు సేకరించి పరీక్షిస్తే... నెగెటివ్ రాగా ఇంటికి పంపించారు. మరో 14 రోజులు హోమ్ క్వారెంటైన్​లో ఉండాలని సూచించారు. వారిలో 19 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించారు. అందులో 18 మందివి నెగెటివ్ రాగా... ఒకరికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి గతంలో మర్కజ్ వెళ్లొచ్చినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు గతంలో వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో ఒక్క కేసు నమోదు కాకపోవటం వల్ల నిర్మల్ జిల్లాలో ఏడు కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేసినట్టు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. మరో 11 కంటోన్మెంట్ ప్రాంతాల్లో విడతల వారిగా ఆంక్షలు ఎత్తి వేయనున్నట్టు ప్రకటించారు. జిల్లాలో ఇప్పటి వరకు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం 8 మంది డిశ్ఛార్జ్ అయినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ABOUT THE AUTHOR

...view details