ప్రపంచ రికార్డుల్లో భాగస్వామ్యం అయ్యేందుకు సనాతన గో సంస్కృతి ఫౌండేషన్ కోటి గొబ్బెమ్మల పోటీని తలపెట్టింది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించాలి(బి) గ్రామం వద్ద గల సురభి గోశాలలో మహిళలకు గొబ్బెమ్మల పోటీ నిర్వహించారు. మహిళలు, పిల్లలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ గుమ్మం ముందు ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పూజించడం ఆనవాయితీ అని మహిళలు తెలిపారు. గోమాత ముక్కోటి దేవతలకు ప్రతిరూపమని, గొబ్బెమ్మలని పూజిస్తే సంతోషంగా, సౌభాగ్యవతిగా ఉంటారని హిందువుల నమ్మకమని పేర్కొన్నారు.
సురభి గోశాల ఆధ్వర్యంలో కోటి గొబ్బెమ్మల పోటీ - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా చించాలి(బి) గ్రామం వద్ద గల సురభి గోశాలలో కోటి గొబ్బెమ్మల పోటీని నిర్వహించారు. మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
సురభి గోశాల ఆధ్వర్యంలో కోటి గొబ్బెమ్మల పోటీ
గిన్నీస్ బుక్, రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో భాగస్వామ్యం అయ్యేందుకు సురభి గోశాలవారు ఈ పోటీ నిర్వహించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చించాలి(బి) సర్పంచ్ లక్ష్మీ, గోశాల నిర్వాహకులు మన్మోహన్ రెడ్డి, డాక్టర్లు కృష్ణంరాజు, ప్రమోద్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రూ.50 కోసం భార్యను కడతేర్చిన భర్త