తెలంగాణ

telangana

ETV Bharat / state

ముధోల్​లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు - ముధోల్​లో పర్యటించిన వ్యవసాయ అధికారుల వార్తలు

నిర్మల్​ జిల్లా ముధోల్​లో వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు పర్యటించారు. రాయితీ కింద ఇచ్చిన సోయా పంటలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Officers inspect soybean crops in Mudhol
ముధోల్​లో సోయా పంటలను పరిశీలించిన అధికారులు

By

Published : Jun 20, 2020, 10:52 AM IST

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాయితీ కింద రైతులకు పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ఫలితంగా రైతులు ఆందోళన చేపట్టారు. స్పందించిన వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ముధోల్​లోని పంటలను పరిశీలించారు.

రాయితీ కింద పంపిణీ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తలేదని గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని రైతులకు భరోసా కల్పించారు.

ఇదీచూడండి: 'మీకు స్థలాలు ఎవరిచ్చారు? కౌన్సిలర్ భర్త బెదిరింపులు'

ABOUT THE AUTHOR

...view details