నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ పీయూసీ మెుదటి సంవత్సరం విద్యార్థి సంజయ్ బుధవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఒక అమ్మాయి విషయంలో సంజయ్, సాయివరుణ్ గొడవపడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మందలించడంతో సంజయ్ వసతిగృహంపై నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
అమ్మాయి విషయంలో గొడవ.. ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. - nirmal district today news
అమ్మాయి విషయంలో ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు... అక్కడి అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ సంజయ్ అనే విద్యార్థి వసతిగృహం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా బాసరలో జరిగింది.
అమ్మాయి విషయంలో గొడవ.. ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం..
విశ్వవిద్యాలయం సిబ్బంది నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైస్ ఛాన్స్లర్ వీసీ ఆశోక్ చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు.
ఇదీ చూడండి :మేడారంలో ఆ జెండా చూస్తూ నడవాల్సిందే..