మేకల కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవే... నిర్మల్ జిల్లా భైంసాలో అల్లర్లకు దారితీసిందని నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకీ, ఇన్‌ఛార్జీ ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ అల్లర్లలో 12 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఇందులో ఇద్దరు హైదరాబాద్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
భైంసా అల్లర్లు... మేక విషయంలో ఇద్దరి మధ్య మొదలై... : ఐజీ నాగిరెడ్డి - Bhainsa issue
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన అల్లర్ల వివరాలను నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. మేకల విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైందని పేర్కొన్నారు. ఈ అల్లర్లలో 12 మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ig nagireddy
మూడు కార్లు, రెండు ఆటోలు, ఆరు ద్విచక్రవాహనాలు, ఏడు ఇళ్లు పాక్షికంగా, 16 షాపులు దగ్ధమైనట్లు ఐజీ తెలిపారు. ఇప్పటి వరకు 22 మందిని అరెస్టు చేసి... 19 కేసులు నమోదు చేశామని వివరించారు. ఇందులో ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారన్న నాగిరెడ్డి... ఘటనలో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :భైంసాలో చెలరేగిన అల్లర్లు