Basara RGUKT Protest: బాసర విద్యార్థుల నిరసన ఇంకా కొనసాగుతోంది. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వర్షంలోనూ ఆందోళన చేసిన విద్యార్థులు.. రాత్రంతా నిరసన కొనసాగించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే.. విద్యార్థులతో డైరెక్టర్, కలెక్టర్ అర్ధరాత్రి చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు కొలిక్కిరాలేదు. అర్ధరాత్రి వేళలోనూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థులతో ఆర్‌జీయూకేటీ డైరెక్టర్ సతీశ్ కుమార్, కలెక్టర్ ముష్రాఫ్ అలీ చర్చలు జరిపారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ట్రిపుల్‌ఐటీలో కొలిక్కిరాని చర్చలు.. రాత్రంతా కొనసాగిన ఆందోళన - IIIT students protest
Basara RGUKT Protest: బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. విద్యార్థుల ఆందోళన రాత్రంతా కొనసాగింది. విద్యార్థులతో ఆర్‌జీయూకేటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్, కలెక్టర్ ముష్రాఫ్ అలీ అర్ధరాత్రి చర్చలు జరిపినా లాభం లేకపోయింది. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టారు.
ఇప్పటికే విద్యుద్దీకరణ, ప్లంబింగ్, నీటి వసతి మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు. నిబంధనలకు అనుకూలంగా వీసీ నియామకం జరుగుతుందని తెలిపారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా ఉన్నారని అధికారులు వివరించారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించి వసతి గృహాలకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. మంత్రుల ద్వారా రాతపూర్వకంగా హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టారు. మంత్రులతో అర్ధరాత్రి హామీ ఇప్పించడం ఇబ్బందికరమని అధికారులు వారికి చెప్పారు. అర్ధరాత్రి చర్చలకు లేని ఇబ్బందులు హామీకి ఏం అడ్డు వస్తుందని విద్యార్థులు ప్రశ్నించారు.
ఇవీ చూడండి: