నిర్మల్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు పురపాలక కార్యాలయంలో నామినేషన్లు సమర్పిస్తున్నారు. కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి... అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. రోజూ ఉదయం పదిన్నరకు ప్రారంభమైన ప్రక్రియ... 5 గంటల వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి రోజు సాయంత్రం వరకు 9 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.
జోరుగా నామినేషన్లు దాఖలు - nominations in nirmal muncipality
నిర్మల్ పురపాలక ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు నామపత్రాలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.
జోరుగా నామినేషన్లు దాఖలు