నిర్మల్ జిల్లా భైంసా ఘటనలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశామని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. భైంసాలో దాడులు ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. మత్తులో నుంచి బయటకు వస్తే ఎన్నిసార్లు ఈ ఘటనలు జరిగాయో తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
భైంసా ఘటనలపై అమిత్‌షాకు ఫిర్యాదు చేశాం : అర్వింద్ - nizamabad mp arvind kumar on bhainsa riots
నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఇది బంగారు తెలంగాణనా లేక మజ్లిస్ రాజ్యమా అని ప్రశ్నించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
ఓట్ల కోసం తండ్రి, కుమారుడు ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నారని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బంగారు తెలంగాణానా లేక మజ్లిస్ రాజ్యమా అని ప్రశ్నించారు.