కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కాలనీ వాసులంతా అప్రమత్తంగా ఉండాలని కౌన్సిలర్ కత్తి నరేందర్ సూచించారు. నిర్మల్ పట్టణం బుధవార పేటలో.. ఆయన హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
'అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు' - నిర్మల్ కరోనా వార్తలు
నిర్మల్ పట్టణం 36వ వార్డు కౌన్సిలర్.. కరోనా నేపథ్యంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కాలనీల్లో హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. పనుల నిమిత్తం బయట తిరిగే వారు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని ఆయన సూచించారు.
nirmal covid cases today
మహమ్మారి పట్ల ప్రజలు భయాందోళనలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నరేందర్. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వైద్య పరీక్షలు, ప్రసవాలు