సమాజంలో వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయంటే దానికి మనమే బాధ్యులమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. కరోనా నేపథ్యంలో నిర్మల్ పట్టంలోని డవ్ వృద్ధాశ్రమ వృద్ధులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. అక్కడున్న వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలని, మనమూ భవిష్యత్తులో వృద్ధులయ్యాక ఇదే గతి పడుతుందని అన్నారు.
'తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించొద్దు' - nirmal sp shashidhar raju latest news
నవమాసాలు మోసి కనీ పెంచి... ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారికి వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సింది పోయి వృద్ధాశ్రమాలకు తరలించడం అమానవీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు.
తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించొద్దు
నవ మాసాలు మోసి కనీ పెంచి... మనల్ని ప్రయోజకులుగా తీర్చి దిద్దిన వారిని గురువు, దైవంతో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీలు శ్రీనివాసరావు వెంకట్ రాంరెడ్డి , డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐ జాన్ దివాకర్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్