కరోనా వైరస్ కట్టడికి పోలీసు సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు ప్రశంసించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దాతల ఔదార్యం వెలకట్టలేనిది: ఎస్పీ శశిధర్‌రాజు - nirmal Sp shashidhar raju
ప్రజలకు నిరంతరాయంగా సేవలందిస్తున్న సిబ్బందికి ఏదో రూపంలో దాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. కొమ్మ ప్రసాద్ ఫౌల్ట్రీ సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.
దాతల ఔదార్యం వెలకట్టలేనిది: ఎస్పీ శశిధర్‌రాజు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొమ్మ ప్రసాద్ ఫౌల్ట్రీ సౌజన్యంతో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ పట్టణ, గ్రామీణ సీఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, సోన్ సీఐ జీవన్ రెడ్డి, ఎస్ఐలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.