తెలంగాణ

telangana

ETV Bharat / state

Mavoisrt: ఒగ్గు సట్వాజి దంపతులకు పట్టాపాసు పుస్తకం అందజేత - జనజీవన స్రవంతిలో కలిసిన ఒగ్గు సట్వాజి దంపతులకు ప్రభుత్వ సాయం

మావోయిస్టు జీవితానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలిసిన ఒగ్గు సట్వాజి, అతని భార్యకు... ప్రభుత్వ హామీ మేరకు నిర్మల్ జిల్లా పోలీసులు ఐదెకరాల భూమికి సంబంధించిన పట్టాపాసు పుస్తకాలను అందజేశారు.

nirmal sp distributed 5 acres of land pass book to former mavoist
ఒగ్గు సట్వాజి దంపతులకు పట్టాపాసు పుస్తకం అందజేత

By

Published : Jun 19, 2021, 6:29 PM IST

2019 సంవత్సరంలో మావోయిస్టులు ఒగ్గు సట్వాజి అతని భార్య ఇద్దరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు సట్వాజి దంపతులకు డబ్బుతో పాటు ఇంటిని ఇదివరకే అందజేశారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ చొరవతో... ప్రభుత్వ హామీ మేరకు ఐదెకరాల భూమిని ఇచ్చారు. అందుకు సంబంధించిన పట్టాపాసు పుస్తకాలను జిల్లా ఎస్పీ సట్వాజీ దంపతులకు అందజేశారు.

గతంలో లొంగిపోయిన మావోయిస్టుల మాదిరిగానే... ఇప్పుడు కూడా మావోయిస్టులు లొంగిపోతే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు అడవి జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ రమేష్, నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేష్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details