కరోనాతో మృతి చెందుతున్న వారి దహన సంస్కారాలకు ఎలక్ట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతి పత్రం అందజేశారు. అదే విధంగా శ్మశాన వాటికలో మృతదేహాల దహన సంస్కారాలకు అవసరమయ్యే కట్టెలను ఏర్పాటు చేయాలని కోరారు. సేవా సమితికి అనుమతిస్తే వాటిని సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు లక్కడి జగన్మోహన్ రెడ్డి, నార్లపురం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
'దహన సంస్కారాలకు ఎలక్ట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలి' - nirmal seva samithi requesting to collector for electric machines
కరోనా మృతులు పెరుగుతుండటంతో వారి అంతిమ కార్యాలకు ఎలక్ట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్మల్ సేవాసమితి.. కలెక్టర్‌ను విజ్ఞప్తి చేసింది. ఆయనను కలిసి సేవాసమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు.
!['దహన సంస్కారాలకు ఎలక్ట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలి' nirmal seva samithi requesting to collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:57:10:1619616430-tg-adb-35-28-collectorkuvinati-av-ts10033-28042021185410-2804f-1619616250-204.jpg)
నిర్మల్ కలెక్టర్‌కు వినతి
Last Updated : Apr 28, 2021, 7:46 PM IST