తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి'

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలపై అవగాహన కల్పిస్తూ దుకాణ సముదాయలలో డిపో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ కరపత్రాలను పంపిణీ చేశారు. కరోనా సమయంలో ఆర్టీసీ నూతనంగా కార్గో గూడ్స్ సేవలను ప్రారంభించిందని.. సేవలను అందరూ వినియోగించుకోవాలని విశ్వనాథ్​ తెలిపారు.

pamphlets distribution by nirmal rtc depo manage
'ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి'

By

Published : Sep 7, 2020, 3:04 PM IST

ఆర్టీసీ కార్గో సేవలను సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్​లోని ఆర్టీసీ డిపోలో డిపో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలపై అవగాహన కల్పిస్తూ దుకాణ సముదాయలలో కరపత్రాలను పంపిణీ చేశారు. వస్తు రవాణా కోసం ఆర్టీసీ నూతనంగా కార్గో గూడ్స్ సేవలను ప్రారంభించిందని విశ్వనాథ్​ తెలిపారు.

కరోనా పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కార్గో సేవలను ప్రజలకు అందుబాటులో తెచ్చామని విశ్వనాథ్​ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కిషోర్, ఆర్.గంగాధర్, దండు గంగన్న, అనముల శంకర్, సుంకరి రమేష్, రిజర్వేషన్ బాధ్యులు టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా బాధితులకు డెంగ్యూ, మలేరియా ముప్పు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details