ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్, క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కరోనా కష్ట కాలంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం రెండు వేలు, 25 కిలోల బియ్యం అందించడం హర్షించదగిన విషయమని అన్నారు. అదే పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ బస్ డ్రైవర్లు, క్లీనర్లను ఆదుకోకపోవడం బాధకారమని పేర్కొన్నారు.
కరోనా కాలంలో సాయం చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం - నిర్మల్ కలెక్టర్కు వినతిపత్రం
కరోనా కారణంగా నిర్మల్ జిల్లాలో జీవనోపాధి కోల్పోయిన ప్రైవేటు పాఠశాలల డ్రైవర్లు, క్లీనర్లను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్, క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
![కరోనా కాలంలో సాయం చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం non teaching staff problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:11:35:1620636095-tg-adb-33-10-jeevanabrutikalpinchali-av-ts10033-10052021135459-1005f-1620635099-63.jpg)
సాయం చేయమంటూ కలెక్టర్కు వినతి
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోధనేతర సిబ్బందికి సాయం చేయాలని కోరారు. అంతకు ముందు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కిషన్, సాయన్న, రాం లక్ష్మన్, తిరుపతి, శ్రీనివాస్, నరేశ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా