మందకొడిగా నిర్మల్ ప్రాదేశిక ఎన్నికలు - district sp
నిర్మల్ జిల్లాలోని ఆరు మండలాల్లో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు.
మందకొడిగా ఎన్నికలు
నిర్మల్ జిల్లాలోని 6 మండలాల్లో జరుగుతున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. కలెక్టర్ ప్రశాంతి, జేసి భాస్కర్ రావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎండల తీవ్రత, కొందరు ఉపాధి హామీ పనులకు వెళ్లడం వల్ల పోలింగ్ మందకొడిగా కొనసాగింది.